

ఇటీవల ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సమంత రూత్ ప్రభు. ఇప్పుడు తమిళంలో కొత్త బాధ్యతను స్వీకరించారు. ప్రముఖ రియాలిటీ షో ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు ఆమె హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ప్రకటించింది. ఈ షో సోనీ విజా, సోనీ లివ్ వేదికలపై త్వరలో ప్రసారం కానుంది. తమిళ వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు.
ఈ షో తన గత ప్రాజెక్ట్‌లకు పూర్తిగా భిన్నమైనదని సమంత తెలిపారు. ఆహారం ప్రజలను ఒక్కచోట చేర్చి, మధురమైన జ్ఞాపకాలను సృష్టించే శక్తి కలిగి ఉందని ఆమె అన్నారు. ప్రముఖులు వంటగదిలోకి వచ్చి కొత్త వంటకాలను ప్రయత్నిస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ పోటీపడటం ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులతో కొత్త అనుభూతిని పంచుకోవడానికి తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు సమంత చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!