

ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నివేద్య రెడ్డి నిర్మిస్తున్న ‘ది ఇండియన్ బార్డర్’ చిత్రాన్ని డి.ఎస్. బాషా తెరకెక్కిస్తున్నారు. కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీమోహన్, మేఘా శ్రీ, సిందు తులాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్రంలోని ‘జిందా రహేన్ తో డ్యూటీ’ దేశభక్తి గీతాన్ని విడుదల చేశారు. ఆనంద్ మంత్ర సంగీతం అందించగా, డి.ఎస్. బాషా సాహిత్యం, శరవణ గానం అందించారు.
మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్:
దేశం గురించి, సైన్యం గురించి సినిమా తీయడం ఆనందంగా ఉంది. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయటి ఆహారాన్ని తినొద్దు. నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధించాలి అని అన్నారు.
హీరో, రైటర్ కిరణ్:
'ది ఇండియన్ బార్డర్' ఈవెంట్ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. పాలస్తీనా వార్ టైంలో ఈ కథ నాలో పుట్టింది. బాషా గారు ఈ కథకు ఓ స్వరూపాన్ని తీసుకు వచ్చారు. ఎక్స్ ఆర్మీ పర్సన్స్, మీడియా మాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. సైనికుడు చేసే త్యాగం, సైనికుడి భార్య చేసే త్యాగాల్ని ఇందులో చూపించాం. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు డి.ఎస్. బాషా:
‘ది ఇండియన్ బార్డర్’ ఈవెంట్‌కి వచ్చిన ఆర్మీ అధికారులు, మీడియా వారికి థాంక్స్. సైనికుడి త్యాగం, ఆలోచనలు, గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. అందుకే ఈ పాటను కూడా సైనికుడికి అంకితం చేసేలా తీశాం. మనం ఈ రోజు ఇక్కడ ఇలా సంతోషంగా ఉన్నామంటే. దానికి కారణం అక్కడ సైనికుడు చేసే త్యాగమే. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన సుకుమార్ రైటింగ్స్ టీంకు థాంక్స్. కిరణ్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇంత మంచి కథ, సినిమాలో భాగం అవ్వడం నాకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.
నిర్మాత నివేద్య రెడ్డి:
‘ది ఇండియన్ బార్డర్’ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరూ కలిసి ఓ ఫ్యామిలీలా కష్టపడ్డాం. నా తండ్రి కూడా సైనికుడే. ఈ చిత్రంతో మానవ సంబంధాలు, ఎమోషన్స్‌ని చూపించాలని అనుకున్నాం. సైనికులకు అంకితమిచ్చేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాం గోపాల్ చౌదరి:
కిరణ్ నాకు ఓ మంచి కథను చెప్పారు. దేశ భక్తి మీద చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. కిరణ్ అందరికీ సహాయం చేస్తుంటాడు. అందుకే నేను కిరణ్‌కి, నివేద్య గారికి నా వంతుగా సాయం చేశాను అని అన్నారు.
కొరియోగ్రాఫర్ రమేష్ మాస్టర్:
జిందా రహేన్ తో డ్యూటీ పాట చాలా బాగా వచ్చింది. అందరూ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ మంత్ర:
‘ది ఇండియన్ బార్డర్’ కథ అద్భుతంగా ఉంటుంది. ఆర్ఆర్ చేస్తున్నా. చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. గొప్ప మెసెజ్ ఉంటుంది. అందరూ ఈ మూవీని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!