

తెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, కోర్ అర్బన్ రీజియన్ (సీయూఆర్‌ఈ) పరిధిలోని ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో రైల్ భాగస్వామ్యంతో రోజువారీ, నెలవారీ కామన్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పాస్‌తో ఓఆర్‌ఆర్ పరిధిలో నడిచే టీజీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సులు (పుష్పక్ మినహా), మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. రోజువారీ కామన్ పాస్ ధర రూ.400 కాగా, నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించారు. తొలిసారి కార్డు తీసుకునేటప్పుడు రూ.100 చెల్లించాలి; కార్డు తిరిగి ఇచ్చినప్పుడు ఆ మొత్తం వాపసు చేస్తారు.
అదే సమయంలో సిటీ బస్సు ప్రయాణికుల కోసం ‘మీటికెట్t’ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. యాప్‌లో ఎక్కే ప్రదేశం, గమ్యస్థానం, టికెట్ రకాన్ని ఎంచుకుని డిజిటల్‌గా చెల్లిస్తే డైనమిక్ క్యూఆర్ కోడ్‌తో టికెట్ లభిస్తుంది. దీంతో కాగితపు టికెట్లు, చిల్లర సమస్యలకు పరిష్కారం లభించనుంది. యాప్‌లో రూ.600తో డిజిటల్ వీక్లీ బస్ పాస్ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ పాస్‌తో వారం రోజుల పాటు అన్ని బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. రోజువారీ, నెలవారీ పాస్‌లను కూడా యాప్ ద్వారా పొందవచ్చు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!