
క్రీడలు

ప్రముఖ నటుడు గిరిబాబు మరణవార్త తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గిరిబాబు విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు సినీ ప్రేక్షకుల ఆదరణ పొందారని గుర్తుచేశారు. తనదైన శైలిలో హాస్యాన్ని పండించి ప్రేక్షకులను అలరించారని కొనియాడారు.
నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా గిరిబాబు విజయవంతమైన చిత్రాలను రూపొందించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. గిరిబాబు కుమారుడు, నటుడు రఘుబాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!