

హైదరాబాద్ వేదికగా ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) 85వ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. నవంబర్ 19 నుంచి 22 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. దేశవ్యాప్తంగా రహదారుల రంగానికి చెందిన ఇంజినీర్లు, పరిశోధకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రోడ్లు, జాతీయ రహదారుల అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై వారు చర్చించనున్నారు.
ఈ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దేశంలోని రహదారుల రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన రవాణా వ్యవస్థల అభివృద్ధిపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సదస్సు ద్వారా రహదారుల అభివృద్ధికి సంబంధించి కీలక సూచనలు, ఆలోచనలు వెలువడే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!