17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

Writer: Chandrika 10:34 PM, 16 నవంబర్, 2026
ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, జైలు నుంచి ప్రాణాలతో బయటకు వస్తానో లేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు, తన భార్య బుష్రా బీబీకి సరైన వైద్య చికిత్స అందేలా చూడాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన రాసిన ఈ లేఖను న్యాయవాది సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో వెల్లడించారు. వైద్య చికిత్స, జైలులో కల్పించాల్సిన సౌకర్యాలపై గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. తనను రోజుకు సుమారు 22 గంటల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారని, ఇతర ఖైదీలు, కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో మాట్లాడేందుకు అనుమతించడం లేదని ఆరోపించారు. కుమారులతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని, పుస్తకాలు, టీవీ సౌకర్యాలను సైతం నిలిపివేశారని పేర్కొన్నారు. దీర్ఘకాలిక ఏకాంత నిర్బంధం, వైద్య సంరక్షణ లోపం కారణంగా తన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, తన భార్య బుష్రా బీబీ కంటిచూపు కూడా క్షీణిస్తోందని, శస్త్రచికిత్స చేయకపోతే ఆమె శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రికి తరలించాలని, కుటుంబ సభ్యులతో వారానికోసారి సమావేశం కావడానికి, కుమారులతో వారానికి రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడేందుకు ఆగస్టు 18న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే అధికారులు వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. అప్పటి నుంచి తన ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇటీవల రక్తపోటు భారీగా పెరగడంతో మెదడులో రక్తస్రావం లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు తెలిపారు. తాను బతికి ఉంటేనే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలనని పేర్కొంటూ, ఆలస్యం కాకముందే మానవతా దృక్పథంతో స్పందించి తనకు, తన భార్యకు తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని న్యాయస్థానాలను అభ్యర్థించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
ట్యాగ్లు
ఇమ్రాన్ ఖాన్పాకిస్థాన్ వార్తలుఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంబుష్రా బీబీపాకిస్థాన్ సుప్రీంకోర్టుఇస్లామాబాద్ హైకోర్టుపాకిస్థాన్ రాజకీయాలుఇమ్రాన్ ఖాన్ లేఖజైలు పరిస్థితులువైద్య చికిత్సఏకాంత నిర్బంధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..
జనరల్

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..
సినిమాలు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..
జనరల్

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..
జనరల్

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్
టెక్నాలజీ

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ
జనరల్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్
జనరల్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు
జనరల్

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా
జనరల్

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా