

అంతర్జాతీయ సమావేశాల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మహిళా నేతలను పలకరించే తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో జరిగిన ఓ సమావేశంలో మెక్రాన్ ఆమె చెవిలో ఏదో చెప్పడంతో పాటు చెంపకు చెంప ఆనించి పలకరించిన దృశ్యాలు అప్పట్లో చర్చకు దారితీశాయి. ఈ ఏడాది పారిస్‌లోని ఎలీసీ ప్యాలెస్‌లో జరిగిన అమెరికా, ఐరోపా నేతల సమావేశంలోనూ మెలోనీతో ఆయన పలకరింపు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ఐస్‌లాండ్ ప్రధాని క్రిస్‌టూన్ ఫ్రాస్టదోతిర్‌తో జరిగిన సమావేశంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆమెను కౌగిలించుకుని అభినందించేందుకు మెక్రాన్ ప్రయత్నించగా, క్రిస్‌టూన్ కొంత వెనక్కి జరిగి ఆయన భుజంపై చేయి ఉంచినట్లు వీడియో దృశ్యాల్లో కనిపించింది. ఈ పలకరింపు సమయంలో ఆమె అసౌకర్యంగా ఉన్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించడంతో, ప్రస్తుతం ఈ ఘటనపై చర్చ జరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!