

ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు, దివంగత మీడియా దిగ్గజం రామోజీరావు జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు సేవలను స్మరించుకున్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ.. సమాజానికి విశేష సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి గౌరవించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ వేడుకలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి, సమాజానికి విశేష సేవలు అందించిన ప్రముఖులను రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులతో సత్కరించారు. రామోజీరావు ఆశయాలు, విలువలు, ఆయన అందించిన సేవలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు ప్రతిభావంతులను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పేర్కొన్నారు



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!