

పంజాబ్‌లోని యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న క్విజ్ పోటీని నిర్వహించనుంది. ‘పంజాబ్ దా కరోడ్‌పతి’ పేరుతో ఈ పోటీని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. ఇందులో విజేతగా నిలిచిన వారికి కోటి రూపాయల నగదు బహుమతి అందించనున్నారు. రెండో స్థానంలో నిలిచే నలుగురికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు. పోటీలో పాల్గొనే దాదాపు 10 వేల మంది యువతకు కూడా ఇతర బహుమతులు అందించనున్నట్లు సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతీయువకులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల పేర్లను నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. పంజాబ్ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, గణితం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై ప్రశ్నలు అడగనున్నారు. మొత్తం 11 రౌండ్లలో తొమ్మిది ఆన్‌లైన్‌లో, రెండు ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. పదో రౌండ్‌ను రాష్ట్రంలోని జిల్లాల్లో నిర్వహించి, అక్కడి విజేతలను గ్రాండ్ ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. చివరి రౌండ్‌లో విజేతను ప్రకటించనున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!