

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పేవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేయడం వంటి అంశాలను సీఎం మిట్టల్‌కు వివరించారు.
ఈ సందర్భంగా చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని, తెలంగాణలో మరింత పెద్ద డేటా సెంటర్, AI మౌలిక సదుపాయాల క్యాంపస్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, AI కార్యకలాపాలను విస్తరించాలని కోరారు. దీనికి స్పందించిన సునీల్ మిట్టల్, భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని, హైదరాబాద్‌ను ఎయిర్‌టెల్ రెండో ప్రధాన కేంద్రంగా భావిస్తున్నామని తెలిపారు. అలాగే డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఫైబర్ కనెక్టివిటీ విస్తరణకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!