

హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. చర్లపల్లి టెర్మినల్ నుంచి గోరఖ్‌పూర్ జంక్షన్ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును అక్టోబర్ 2026 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. నాన్-ఏసీ సూపర్‌ఫాస్ట్ రైలుగా నడిచే ఈ సర్వీసు వారానికి ఒకసారి రెండు దిశల్లోనూ రాకపోకలు సాగించనుంది.
రైలు నంబర్ 22075 ప్రతి శుక్రవారం రాత్రి 9:45 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 6:25 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 22076 ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరి సోమవారం సాయంత్రం 5 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. మొత్తం ప్రయాణ సమయం సుమారు 32 గంటల 40 నిమిషాలు ఉండనుంది.
ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆధునిక నాన్-ఏసీ బోగీలను ఏర్పాటు చేశారు. జనరల్ అన్‌రిజర్వ్‌డ్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉండనున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం సీట్ల వద్ద మొబైల్ చార్జింగ్ పాయింట్లు, సీల్డ్ గ్యాంగ్‌వేలు వంటి సదుపాయాలు కల్పించారు. పుష్-పుల్ టెక్నాలజీతో గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు నడిచేలా రూపొందించారు.
ఈ రైలు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. తెలంగాణలో కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల స్టేషన్లలో ఆగుతుంది. అనంతరం బల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సి, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్ సెంట్రల్, లక్నో మీదుగా గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. ఈ కొత్త రైలు సర్వీసుతో హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లే వలస కార్మికులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!