
జనరల్

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు సంబంధించిన తేదీలను అధికారికంగా ప్రకటించింది.

ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 20 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు షెడ్యూల్‌ను పరిశీలించి, అందుకు అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలని సూచిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి బోర్డు మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!