

అగ్నివీర్ ఆర్మీ గ్రౌండ్ ఎంపిక ఈవెంట్స్‌కు హాజరవుతున్న గజ్వేల్ ప్రాంత అభ్యర్థులకు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులను కలిసి వారికి అడ్మిట్ కార్డులను అందజేశారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో గ్రౌండ్ ఈవెంట్స్‌లో పాల్గొని భారత సైన్యంలో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ మంచి ప్రతిభ కనబరిచి దేశ సేవ చేసే అవకాశం దక్కించుకోవాలని కోరుకున్నారు.
ఎంపికైన అభ్యర్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో స్వయంగా కలిసి అభినందిస్తానని చందన రవీందర్ తెలిపారు. ఈసారి ఎంపిక కాకపోయినా నిరాశ చెందవద్దని, అపజయాన్ని విజయానికి తొలి మెట్టుగా భావించి మరింత పట్టుదలతో సాధన కొనసాగించాలని సూచించారు. జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు కృషి చేయాలని, భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయడంతో పాటు గజ్వేల్ ప్రాంతానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అభ్యర్థుల్లో స్ఫూర్తి నింపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!