

ప్రవాస భారతీయులు పెట్టుబడులతో స్వదేశానికి మద్దతుగా నిలిచి పుట్టినగడ్డకు రుణం తీర్చుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, ఈ ప్రయాణంలో ప్రవాసులు భాగస్వాములు కావాలని కోరారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 19వ ‘ఆట’ జాతీయ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగిల్ విండో విధానం అమల్లో ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లోని మూసీ నదిని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తున్నామని, నగర రూపురేఖలను మార్చే ప్రణాళికలు అమలు చేస్తున్నామని భట్టి వెల్లడించారు. ప్రవాసులు తమ విజ్ఞానాన్ని స్వగ్రామాల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక చట్టబద్ధ వ్యవస్థపై ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. ఇదే కార్యక్రమంలో మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ తెలుగు సమాజం రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!