
జనరల్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబానికి సంబంధించిన భూముల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఉన్నట్లు పేర్కొంటున్న భూముల వివరాలను ఫ్లెక్సీల్లో పొందుపరిచారు. ఈ ఫ్లెక్సీలు నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపించినట్లు సమాచారం.
ట్యాంక్‌బండ్ సహా రద్దీగా ఉండే ప్రధాన ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే వీటిని ఎవరు ఏర్పాటు చేశారనే విషయం అధికారికంగా స్పష్టతకు రాలేదు. కేసీఆర్ కుటుంబ భూములపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!