
జనరల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖకు చేరుకోనున్న సీఎం.. రామకృష్ణ బీచ్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 19న విశాఖలో సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. విశాఖ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 26,426 మంది లబ్ధిదారులను పట్టాల పంపిణీ కోసం గుర్తించారు. అలాగే పలు మౌలిక సదుపాయాల ప్రారంభ, శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!