18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

Writer: Shivani K 10:12 AM, 18 సెప్టెంబర్, 2026
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కలిశారు. ఈ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పీఎంఏవై-జీ పథకం కింద తొలి విడతగా తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గత జూలైలో 11,56,915 అర్హ గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని ఢిల్లీలో తాను సమర్పించిన వినతిపత్రాన్ని సీఎం గుర్తుచేశారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా కేటాయించాలని కోరారు.

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో పెరిగిన విద్యుత్ వినియోగంపై రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు. పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని, 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్లు, కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పంట మార్పిడిని ప్రోత్సహించేందుకు కేంద్రం సహకరించాలని సీఎం కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిశివరాజ్ సింగ్ చౌహాన్తెలంగాణ ప్రభుత్వంపీఎంఏవై-జీఇందిరమ్మ ఇళ్లుగ్రామీణ గృహాలుఎల్‌నినోవ్యవసాయంరైతులుసన్నబియ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...
క్రీడలు

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

సారా అర్జున్‌ తదుపరి చిత్రం.. హీరోగా అంబరీష్ వర్మ?
గాసిప్స్

సారా అర్జున్‌ తదుపరి చిత్రం.. హీరోగా అంబరీష్ వర్మ?

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ
జనరల్

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌
జనరల్

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!
జనరల్

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి
జనరల్

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?
రాజకీయాలు

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!