
జనరల్

భారత్ ఫ్యూచర్ సిటీలో మరో కీలక పెట్టుబడికి అడుగులు పడుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్ పరిధిలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఎస్‌బీఐ డేటా సెంటర్ కోసం తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ను ఏఐ, డేటా సెంటర్ల హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్లు, ఏఐ, గ్లోబల్ కంపెనీలకు సంబంధించిన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఏర్పడింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!