

చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.2.50 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఎస్టీఓ అధికారి ఎం. లక్ష్మణ్, అసిస్టెంట్ ఎస్టీఓ అధికారి కె. అనురాధపై బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఫిర్యాదు ఆధారంగా ఇవాళ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టగా.. బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఎం. లక్ష్మణ్ రూ.50 వేలు, కె. అనురాధ రూ.50 వేలు తీసుకున్నట్లు సమాచారం. అనురాధ తన వ్యక్తిగతంగా నియమించుకున్న జంగయ్య అలియాస్ చిన్న ద్వారా రూ.50 వేలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకుని చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. వారి నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయని, బాధితుడి వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!