

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జెన్ Z, జెన్ ఆల్ఫా తరానికి చెందిన యువత దేశ భవిష్యత్‌పై బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడుతూ.. దేశం తమకు ఏం చేసిందని ప్రశ్నించడం కంటే, తాము దేశానికి ఏం చేయగలమో యువత ఆలోచించాలని సూచించారు. యువత తమ పాత్ర, బాధ్యతలపై ఆలోచించి ఆయా రంగాల్లో నాయకత్వం వహించాలని కోరారు.
దేశం సురక్షితంగా, బలంగా ఉంటేనే ప్రజలకు స్థిరమైన భవిష్యత్ ఉంటుందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలను ప్రస్తావిస్తూ జాతీయ భద్రత, పౌర బాధ్యతల ప్రాధాన్యాన్ని వివరించారు. యువత తమ విద్య, నైపుణ్యాలు, నాయకత్వ సామర్థ్యాలతో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె సూచించారు. అదే సమయంలో సవాళ్లను ఎదుర్కొనే సమయంలో అహంకారానికి దూరంగా ఉండి, వినయంతో ముందుకు సాగాలని స్నాతకులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!