

ఉత్తర్‌ప్రదేశ్ ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధిగమించి దేశ ఆర్థిక ప్రగతికి కీలకంగా మారిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర్‌ప్రదేశ్ ఇక ‘బీమారు’ రాష్ట్రం కాదని పేర్కొన్నారు. సంప్రదాయ చేతివృత్తులు, స్వదేశీ ఉత్పత్తులు, ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 96 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నాయని, వాటి ద్వారా సుమారు 3.25 కోట్ల మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు.
విశ్వకర్మ జయంతి సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ‘విశ్వకర్మ స్వరోజ్‌గార్ అండ్ స్వదేశీ మేళా-2026’ను ప్రారంభించారు. సంప్రదాయ కళాకారులకు శిక్షణ, పనిముట్లు, రుణాలు, మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గత ఏడెనిమిదేళ్లలో విశ్వకర్మ శ్రమ్ సమ్మాన్ యోజన కింద 6 లక్షలకు పైగా కళాకారులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, శిక్షణ అందించినట్లు తెలిపారు. ఇదే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!