

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్‌లో సంభవించిన విపత్తు కారణంగా రాష్ట్రానికి చెందిన ఎవరైనా చిక్కుకున్నారా అనే అంశంపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం 011-23384016, 011-23387089 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే 9059824101 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చు. ఆర్టీజీ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!