
జనరల్

కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్‌లోని దిఘా బీచ్‌కు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న అనంతరం బెంగాల్ అధికారులు మత్స్యకారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత స్వస్థలానికి తిరిగి పంపేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
అవసరమైన ప్రక్రియలు పూర్తైన వెంటనే మత్స్యకారులు ఇవాళ పశ్చిమ బెంగాల్ నుంచి ఓడలరేవుకు బయలుదేరనున్నట్లు సమాచారం. వారు తిరిగి స్వస్థలానికి చేరుకోనుండటంతో కుటుంబ సభ్యులు, స్థానిక మత్స్యకార వర్గాల్లో ఉపశమనం వ్యక్తమవుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!