
క్రీడలు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓ ఆటోను ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా అధికారులు తెలిపారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!