

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభావంతమైన మహిళా దర్శకురాళ్లలో నందిని రెడ్డి ఒకరు. ఇప్పటివరకు పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె, విజయవంతమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో ఆమె తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో, సినీ వర్గాల్లో నెలకొంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, నందిని రెడ్డి తన తదుపరి సినిమాను త్రిష, తమన్నాలతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ఈ ఇద్దరు కథానాయికలతో నందిని రెడ్డి కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రాజెక్ట్ ఖరారైతే నందిని రెడ్డి దర్శకత్వంలో త్రిష, తమన్నా కలిసి నటించడం ఆసక్తికరమైన కాంబినేషన్‌గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!