
సినిమాలు

దేశీయ ఆటోమొబైల్ రంగం జులై నెలలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ప్రయాణికుల వాహనాల సరఫరాలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 33 శాతం పెరిగి సుమారు 4.7 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేయగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా రెండంకెల వృద్ధిని సాధించాయి. దీంతో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో సానుకూల ధోరణి కొనసాగుతోంది.
జీఎస్‌టీఅ 2.0 అమలు, రెపో రేట్ల తగ్గింపు, రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు వంటి ఆర్థిక చర్యలు వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ మాట్లాడుతూ, గత ఏడాది జులైలో 3.5 లక్షలుగా ఉన్న ప్రయాణికుల వాహనాల విక్రయాలు ఈ ఏడాది జులైలో 4.65 నుంచి 4.7 లక్షల యూనిట్లకు పెరిగాయని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!