
సినిమాలు

మొరాకో నుంచి వేలాదిమంది వలసదారులు స్పెయిన్‌కు చెందిన సెఉటా సరిహద్దు వద్దకు భారీగా చేరుకున్నారు. ఒక్కసారిగా ఈ స్థాయిలో వలసదారులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించడం స్థానిక అధికారుల్లో ఆందోళన కలిగించింది. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని భావిస్తూ, అదనపు పోలీసులు మరియు సైన్యాన్ని మోహరించాలని స్పెయిన్ ప్రభుత్వాన్ని అధికారులు కోరుతున్నారు. 2021 తర్వాత ఇదే స్థాయిలో వలసదారుల వెల్లువ రావడంతో సెఉటాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనపై అమెరికా వైట్ హౌస్ స్పందించింది. యూరప్‌లో గ్లోబలిస్ట్, అతి వామపక్ష విధానాలు కొనసాగితే ఇలాంటి పరిస్థితులు వస్తాయని డొనాల్డ్ ట్రంప్ గతంలోనే హెచ్చరించారని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. వలస సమస్యపై యూరప్ దేశాల విధానాలపై మళ్లీ దృష్టి కేంద్రీకృతమైంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!