
సినిమాలు

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. కావేరీ నదీ జలాల నియంత్రణ కమిషన్ (సీడబ్ల్యూఆర్‌సీ) కర్ణాటక నుంచి తమిళనాడుకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై కర్ణాటకలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వివాదం మళ్లీ చెలరేగడంతో రాజకీయ, సామాజిక వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
ఈ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం సినీ రంగంపై కూడా పడింది. తమిళ స్టార్ విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా కర్ణాటకలో ప్రదర్శన నిలిపివేయబడింది. ముందుజాగ్రత్త చర్యగా అనేక థియేటర్లు సినిమా పోస్టర్లను తొలగించి, స్క్రీనింగ్‌ను స్వచ్ఛందంగా నిలిపివేశాయి. పరిస్థితి చల్లబడే వరకు ప్రదర్శనలపై అనిశ్చితి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!