

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి సమావేశమై పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేషన్లు, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడి మార్గదర్శకాలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని, స్థానిక నాయకత్వం అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సమావేశాలు నిర్వహించి ఆశావహుల పేర్లపై నివేదికలు సిద్ధం చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సుమారు 60 శాతం పదవులను పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన నాయకులకు కేటాయించాలని నిర్ణయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సామాజిక న్యాయం కల్పించేలా తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాల నుంచి నివేదికలు అందిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తుది జాబితాపై నిర్ణయం తీసుకోనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!