
సినిమాలు

గిరిజన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. జీఎంఆర్ గ్రూప్ నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆర్థికాభివృద్ధి, పర్యాటకం, రవాణా రంగాలకు కొత్త ఊపునివ్వనుంది.
మొదటి దశలోనే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా, భవిష్యత్తులో 4 కోట్ల మంది వరకు సామర్థ్యాన్ని పెంచుకునేలా దీనిని రూపొందించారు. ఎయిర్‌బస్ A380, బోయింగ్ 747 వంటి భారీ విమానాలు దిగే సుదీర్ఘ రన్‌వే, ఆధునిక కార్గో టెర్మినల్, 6-లైన్ల హైవే, భవిష్యత్తులో మెట్రో, బీచ్ కారిడార్ అనుసంధానం, సోలార్ పవర్, జీరో వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ వంటి పర్యావరణ హిత సదుపాయాలు ఈ విమానాశ్రయ ప్రత్యేకతలు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!