
సినిమాలు

భారత్-జపాన్ మధ్య కుదిరిన కొత్త ఉద్యోగ భాగస్వామ్య ఒప్పందం స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు భారీ అవకాశాలను తెరచనుంది. ఈ భాగస్వామ్యంతో ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 5 లక్షల మందికిపైగా ప్రయోజనం పొందేలా ఇరు దేశాలు ప్రణాళికలు రూపొందించాయి.
ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌కు చెందిన 50 వేల మంది నైపుణ్యవంతులైన యువతను జపాన్ నియమించుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, సాంకేతికత, పరిశోధన, ఆరోగ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. జపాన్‌లో ఉద్యోగం చేయాలనుకునే భారత యువతకు ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!