

భారత నౌకాదళం సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అత్యాధునిక ఎస్-5 అణు జలాంతర్గామి నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. సుమారు 13,500 టన్నుల బరువుతో రూపొందుతున్న ఈ నెక్స్ట్-జెన్ సబ్‌మెరైన్‌లో 190 మెగావాట్ల సామర్థ్యమున్న కాంపాక్ట్ లైట్ వాటర్ అణు రియాక్టర్‌తో పాటు 8,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ఛేదించే కే-6 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.10 వేల కోట్ల వ్యయంతో విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్, రాంబిల్లి సమీపంలోని ఐఎన్‌ఎస్ వర్ష నౌకాదళ స్థావరంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
అరిహంత్, అరిఘాత్, ఎస్-4 వంటి అణు జలాంతర్గాముల విజయాన్ని కొనసాగిస్తూ, మరింత శక్తివంతమైన ఎస్-5ను పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నారు. డీఆర్‌డీవో, బార్క్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెసల్ (ఏటీవీ) సంయుక్తంగా రూపొందించిన ఈ జలాంతర్గామి భారత సముద్ర భద్రతకు కీలక బలంగా మారనుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పెంచడంతో పాటు, శత్రు దేశాల కదలికలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని భారత నౌకాదళానికి అందించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!