

హైదరాబాద్‌లోని కంపెనీ భూముల పత్రాలను అనధికారికంగా తాకట్టు పెట్టిన వ్యవహారంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, దాని ప్రమోటర్లపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చర్యలు తీసుకుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను రెండు నెలల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించడంతో పాటు, సంస్థ ఛైర్మన్ సుభాష్ చంద్ర, ఎండీ-సీఈఓ పునీత్ గోయెంకాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. ముగ్గురికీ కలిపి రూ.1.48 కోట్ల జరిమానా విధిస్తూ సెబీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎసెల్ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థలు తీసుకున్న రుణాలకు హామీగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ హైదరాబాద్ ఆస్తుల హక్కు పత్రాలను ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వద్ద తాకట్టు పెట్టినట్లు సెబీ వెల్లడించింది. ఈ విషయాన్ని ఆర్థిక నివేదికల్లో వెల్లడించకుండా కంపెనీ యాజమాన్యం దాచిపెట్టిందని పేర్కొంది. సుభాష్ చంద్ర తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కంపెనీ ఆస్తులను ప్రమాదంలో పెట్టారని, వివాదం వచ్చిన తర్వాత వాస్తవాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని సెబీ తెలిపింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!