

చార్టర్డ్ అకౌంటెంట్, కంటెంట్ క్రియేటర్ కుషల్ లోధా తన గత అనుభవాన్ని పంచుకోవడంతో ఖరీదైన అద్దె ఇళ్లపై చర్చ మొదలైంది. తాను నెలకు ₹1 లక్ష సంపాదిస్తున్న సమయంలో ముంబైలోని లోయర్ పరేల్‌లో నివసించేందుకు నెలకు ₹50 వేల అద్దె చెల్లించేవాడినని ఆయన వెల్లడించారు. తన ఆదాయంలో సగం అద్దెకే వెచ్చించడంపై చుట్టుపక్కల వారు ప్రశ్నించడంతో పాటు, తనను ‘పిచ్చివాడు’ అని కూడా అన్నారని లోధా తెలిపారు.
అయితే ఇది కేవలం ఖరీదైన ఇంటి కోసం తీసుకున్న నిర్ణయం కాదని లోధా వివరించారు. తన చుట్టూ ఉన్న వాతావరణం తన ఆలోచనా విధానం, పని తీరు, లక్ష్యాలను ప్రభావితం చేసిందని చెప్పారు. అవకాశాలు, ఆశయాలు ఉన్న వ్యక్తులతో కలిసి ఉండే వాతావరణం తనకు విలువైనదిగా అనిపించిందన్నారు. అందుకే ఆ ఇంటి అద్దెను కేవలం ఖర్చుగా కాకుండా, తన వాతావరణం, ఆలోచనా విధానంపై పెట్టుబడిగా భావించినట్లు తెలిపారు. దీనిపై కొందరు ఆయన అభిప్రాయాన్ని సమర్థించగా, మరికొందరు కుటుంబ బాధ్యతలు, ఇతర ఆర్థిక అవసరాలు ఉన్నవారికి ఆదాయంలో సగం అద్దెకు కేటాయించడం ఆచరణాత్మకం కాదని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!