
రాజకీయాలు

పండుగల సీజన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నగదు లభ్యతను పెంచేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా నుంచి రూ.1.09 లక్షల కోట్లను ముందస్తు విడతగా విడుదల చేసింది. సాధారణంగా కేటాయించే నిధులకు అదనంగా ఈ మొత్తాన్ని అందించడం ద్వారా రాష్ట్రాల ఆర్థిక అవసరాలకు కేంద్రం మద్దతు పలికింది.
ఈ నిధుల విడుదలలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు విడతగా పన్నుల వాటాను విడుదల చేయడం ఇది రెండోసారి. తాజా నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఇతర కీలక కార్యక్రమాలను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులకు తోడ్పాటునందించనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!