

అమెరికాలోని అట్లాంటా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఆకాశ్ (26) ప్రాణాలు కోల్పోయాడు. పొన్నూరు పట్టణంలోని నేతాజీనగర్‌కు చెందిన దివంగత ప్రముఖ వైద్యుడు కొమ్మినేని శేషగిరిరావుకు ఆకాశ్ మనవడు. ఆయన తల్లిదండ్రులు కల్యాణ చక్రవర్తి, పద్మ దంపతులు చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవలే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆకాశ్ ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగంలో చేరి తన కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు.
నవంబర్ 1న అట్లాంటా సమీపంలో ఆకాశ్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన భారీ ట్రక్కు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమై కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆకాశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై స్థానిక అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమారుడి అకాల మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆకాశ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!