
క్రీడలు

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో ఉన్న ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందినవారు కాగా, మరో ఇద్దరు స్థానికులుగా గుర్తించారు.
ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రియాక్టర్ పేలుడుకు గల కారణాలు, ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో నెలకొన్న పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!