6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..

Writer: Chandrika 10:24 AM, 6 నవంబర్, 2026
జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత పాలకవర్గంలో కీలక పదవులు నిర్వహించిన పలువురు మాజీ కార్పొరేటర్లు తాజా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గతంలో గాజువాక నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా పనిచేసిన ఉరుకూటి చందు 87వ వార్డు నుంచి పోటీ చేసి తెదేపా అభ్యర్థి చేతిలో 292 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాజీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ కూడా 68వ వార్డులో తెదేపా అభ్యర్థి చేతిలో 62 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ తరఫున 52వ వార్డు నుంచి గెలిచిన ఆయన.. ఈసారి వార్డు మార్పుతో 68వ వార్డు నుంచి పోటీ చేశారు. ఆయన బంధువు సత్య 67వ వార్డులో పోటీ చేసి ఓడిపోయారు. మరో మాజీ డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌ భార్య సరళాదేవి 56వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. తెదేపా అభ్యర్థి కొల్లాబత్తుల ప్రసూన 713 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

గతంలో 32వ వార్డు నుంచి కాంగ్రెస్‌ తరఫున, 44వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన మాజీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాస్‌ కూడా తాజా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈసారి జనరల్‌ కేటగిరీకి కేటాయించిన 54వ వార్డు నుంచి పోటీ చేసిన ఆయన.. భాజపా అభ్యర్థి పరశురామరాజు చేతిలో 1,026 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021 జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 98 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 58 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరడంతో వైఎస్సార్‌సీపీలో 32 మంది మాత్రమే మిగిలారు. తాజా ఎన్నికల్లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల మార్పుల నేపథ్యంలో పలువురు మాజీ కార్పొరేటర్లకు వేర్వేరు వార్డుల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. అయినప్పటికీ ఫలితాలు ఆ పార్టీకి నిరాశనే మిగిల్చాయి. మొత్తం 13 వార్డుల్లో మాత్రమే వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా.. అందులో మాజీ కార్పొరేటర్లు కేవలం నలుగురే ఉండటం గమనార్హం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్‌కు మరో రాజకీయ సవాలు.. అభిశంసనకు డెమొక్రాట్ల కసరత్తు

ట్రంప్‌కు మరో రాజకీయ సవాలు.. అభిశంసనకు డెమొక్రాట్ల కసరత్తు

ట్రంప్‌ అవినీతిపై ఎంక్వయిరీ కి రెడీ అవుతున్న డెమోక్రాట్లు

ట్రంప్‌ అవినీతిపై ఎంక్వయిరీ కి రెడీ అవుతున్న డెమోక్రాట్లు

ఏపీలో ఏడు చోట్ల నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీపోలింగ్

ఏపీలో ఏడు చోట్ల నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీపోలింగ్

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు..ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీల మద్దతు

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు..ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీల మద్దతు

ఓటమి భయంతోనే వైసీపీ డ్రామాలు - మంత్రి పయ్యావుల కేశవ్‌

ఓటమి భయంతోనే వైసీపీ డ్రామాలు - మంత్రి పయ్యావుల కేశవ్‌

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

ట్యాగ్లు
జీవీఎంసీ ఎన్నికలువిశాఖపట్నం ఎన్నికలువైఎస్సార్‌సీపీతెలుగుదేశం పార్టీభారతీయ జనతా పార్టీఉరుకూటి చందుజియ్యాని శ్రీధర్బాణాల శ్రీనివాస్మాజీ కార్పొరేటర్లుగ్రేటర్ విశాఖపట్నంఆంధ్రప్రదేశ్ రాజకీయాలుమున్సిపల్ ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హుజూర్‌నగర్‌లో పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

హుజూర్‌నగర్‌లో పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్

భిక్కనూరు ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు
జనరల్

భిక్కనూరు ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్!
జనరల్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్!

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? కొనుగోలుకు ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
బిజినెస్

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? కొనుగోలుకు ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!
క్రీడలు

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..
జనరల్

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి
జనరల్

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..
రాజకీయాలు

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..

ఒడిశా తీరంలో ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్
జనరల్

ఒడిశా తీరంలో ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

ట్రంప్‌కు మరో రాజకీయ సవాలు.. అభిశంసనకు డెమొక్రాట్ల కసరత్తు
రాజకీయాలు

ట్రంప్‌కు మరో రాజకీయ సవాలు.. అభిశంసనకు డెమొక్రాట్ల కసరత్తు

మురసు తుఫాను బీభత్సం.. ఏపీలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం
జనరల్

మురసు తుఫాను బీభత్సం.. ఏపీలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం

ట్రంప్‌ అవినీతిపై ఎంక్వయిరీ కి రెడీ అవుతున్న డెమోక్రాట్లు
రాజకీయాలు

ట్రంప్‌ అవినీతిపై ఎంక్వయిరీ కి రెడీ అవుతున్న డెమోక్రాట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!