

హైదరాబాద్ కేంద్రంగా కీలక ఏరోస్పేస్ విడిభాగాలను తయారు చేస్తున్న సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉత్పత్తిని ప్రారంభించింది. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్‌లో తొలి బ్యాచ్ ప్రెసిషన్-మెషిన్డ్ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ తయారీని చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్లాంట్ ద్వారా ఏరోస్పేస్ రంగంలోని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు, అంతర్జాతీయ ఖాతాదారుల అవసరాలను తీర్చేందుకు సంస్థకు వీలుకానుంది.
శ్రీసిటీ ప్లాంట్‌లో తయారయ్యే ఏరోస్పేస్ కాంపోనెంట్స్‌ను బ్రిటన్‌లోని తమ ప్లాంట్‌కు తరలించనున్నట్లు సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తెలిపింది. అక్కడ అవసరమైన నాణ్యతా ప్రమాణాల ప్రకారం పరీక్షలు, తనిఖీలు నిర్వహించిన అనంతరం ఉత్పత్తులను ఖాతాదారులకు సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ ఏరోస్పేస్ పరిశ్రమకు అవసరమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ తయారీ కార్యకలాపాలను విస్తరించడంలో ఈ ప్లాంట్ కీలకంగా మారనుందని సంస్థ భావిస్తోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!