

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా సినిమా తర్వాత బాలయ్య తన కెరీర్‌లో 112వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో రూపొందించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అక్టోబర్ మొదటి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు బాలకృష్ణ సుమారు మూడున్నర నెలల పాటు కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంటుందని సమాచారం. దీనిని బట్టి సినిమాలో ఆయన పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. కథ, కథనం విషయంలో కొరటాల శివ ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తుండగా, బాలయ్య కూడా త్వరగా చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ కలయికపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!