

ఇటీవల భారతీయ చిత్ర పరిశ్రమలో భక్తి ప్రధానమైన కథలకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తోంది. మన తెలుగు నుంచి వచ్చిన ‘ఇరుముడి’ సినిమాకు అయ్యప్ప స్వామి అంశం బలమైన స్పందనను తీసుకురావడంతో పాటు రవితేజ కెరీర్‌లో ప్రత్యేకమైన విజయాన్ని అందించింది. థియేటర్‌లో సినిమా ప్రదర్శన నిలిపివేయడంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగిన ఘటన అప్పట్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే బాలీవుడ్‌లోనూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపొందిన ‘హనుమాన్ అంశ్’ కూడా చిన్న స్థాయి విడుదల నుంచి అనూహ్య విజయాన్ని అందుకుంటూ దూసుకెళ్తోంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఓ థియేటర్‌లో ‘హనుమాన్ అంశ్’ స్థానంలో మీర్జాపూర్ ప్రదర్శించడంతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సినిమా షోను తిరిగి వేయాలంటూ వారు థియేటర్ వద్ద నిరసనకు దిగగా, విషయం పోలీసుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. చివరకు థియేటర్ యాజమాన్యం మళ్లీ ‘హనుమాన్ అంశ్’ ప్రదర్శించినట్లు సమాచారం. దీంతో బలమైన కథ ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేస్తుందో ఈ ఘటనలు చూపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!