
సినిమాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రాథమిక పొదుపు బ్యాంకు డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపై కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి నెలలో నాలుగు లావాదేవీలు మాత్రమే ఉచితంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిమితి దాటితే అదనపు లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నట్లు సమాచారం.
నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి అదనపు లావాదేవీపై రూ.15తో పాటు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఛార్జీ విధించనున్నారు. బ్యాంకు, ఏటీఎం ద్వారా చేసే నగదు లావాదేవీలతో పాటు డిజిటల్ లావాదేవీలకు కూడా ఈ ఛార్జీలు వర్తిస్తాయని సమాచారం. దీంతో ఎస్బీఐ బీఎస్బీడీ ఖాతాదారులు అక్టోబర్ 1 నుంచి తమ లావాదేవీలపై విధించే ఛార్జీలను గమనించాల్సి ఉంటుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!