

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు, ‘సిగ్మా’ చిత్ర దర్శకుడు జాసన్ సంజయ్ తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన జీవితంలో ఒకే ఒక్క ప్రేమకథ ఉందని, కాలేజీ రోజుల్లో సుమారు ఏడాదిన్నర పాటు కొనసాగిన ఆ బంధం మ్యూచువల్ బ్రేకప్‌తో ముగిసిందని తెలిపారు. విదేశాల్లో చదువుకుంటున్న సమయంలో తమ మధ్య దూరం పెరగడంతో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు చెప్పారు.
బ్రేకప్ తర్వాత యువన్ శంకర్ రాజా లవ్ సాంగ్స్ ఎక్కువగా వింటూ ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నించానని జాసన్ తెలిపారు. గత జ్ఞాపకాల్లో చిక్కుకోకుండా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం గతాన్ని వదిలేసి జీవితంలో ముందుకు సాగుతున్నానని, ఆ తర్వాతే ‘సిగ్మా’ పనిపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైంది. జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!