
రాజకీయాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరిగిన ఘర్షణల ప్రభావంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు ఉత్పత్తి, సరఫరా అంతరాయం కలిగింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 40 శాతం ప్రభావితమైంది. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రష్యా వచ్చే నెల 1 నుంచి పెట్రోలు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ ముడి చమురు దిగుమతులపై ఆధారపడుతున్నప్పటికీ, దేశంలో ఉన్న అధిక శుద్ధి సామర్థ్యం వల్ల ప్రభావం పరిమితంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు సుమారు 5.6 మిలియన్ బ్యారెళ్ల చమురు శుద్ధి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉండటంతో దేశీయ అవసరాలు తీరుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!