

బీఆర్ఎస్ పాలన, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్లు తెలంగాణను పాలించినప్పటికీ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రంలో మంచి కాలేజీలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో మంచి పాఠశాలలు, కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఉపాధ్యాయుల కొరత, యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు, పేపర్ లీకులు, కాలేజీలకు నిధుల కొరత, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీఆర్‌ఎస్‌ను నిలదీశారు.
బీఆర్‌ఎస్ పాలనకు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం నుంచే రిపోర్ట్ కార్డు వస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ మనవడు పాఠశాలల పరిస్థితిపై, మనవరాలు కాలేజీలపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. భారత్ కంటే శ్రీలంక గొప్పదని చెప్పడం కూడా దేశాన్ని అవమానించడమేనని విమర్శించారు. తనకు దేశభక్తి జీవితాంతం నమ్మిన సిద్ధాంతమని, చివరి శ్వాస వరకు కాషాయ జెండాతో పాటు త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ధరిస్తానని పేర్కొన్నారు. భారత్ అవసరమైతే తన రక్తాన్ని కూడా ఇస్తానని, తనకు ఎప్పుడూ ‘నేషనే ఫస్ట్’ అని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!