
జనరల్

సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ, వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు అభిమాన సంఘం మద్దతు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 400కు పైగా అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యమైంది.
ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు లక్ష మందికి పైగా బాలికలు, యువతులకు చేరువైంది. సామాజిక బాధ్యతతో అల్లు అర్జున్ అభిమానులు సమష్టిగా చేసిన ఈ కృషి ద్వారా హెచ్పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. యువతులకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించే దిశగా చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రశంసలు లభిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!