17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్

Writer: Pooja 10:09 AM, 17 ఆగస్టు, 2026
వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్

ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువుల అన్వేషణ సంస్థ ఓఎన్‌జీసీకి వెనెజువెలాలో మళ్లీ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి చేపట్టేందుకు అమెరికా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) ఇందుకు అనుమతి ఇచ్చినట్లు ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆంక్షల కారణంగా ఇప్పటివరకు పరిమిత స్థాయిలోనే కార్యకలాపాలు సాగించిన సంస్థ, తాజా నిర్ణయంతో ఉత్పత్తిని పెంచుకునే అవకాశం పొందింది.

ఓఎన్‌జీసీ విదేశ్‌, వెనెజువెలా ప్రభుత్వ రంగ సంస్థ పీడీవీఎస్‌ఏతో కలిసి శాన్‌ క్రిస్టోబాల్‌ చమురు క్షేత్రంలో 40 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే కారాబొబో ప్రాజెక్టులో 11 శాతం వాటా ఉంది. అమెరికా తాజా అనుమతితో ఈ రెండు క్షేత్రాల్లో ఉత్పత్తిని పూర్తి స్థాయిలో పెంచడంతో పాటు, కొత్త చమురు, గ్యాస్‌ క్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఏర్పడింది. దీంతో మరిన్ని భారతీయ కంపెనీలు వెనెజువెలా ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మిరె అసెట్స్‌ షేర్‌ఖాన్‌ బ్రోకరేజీ అంచనా వేసింది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు వెంటనే తగ్గకపోతే సెప్టెంబరు 15 నాటికి బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారల్‌కు 100 డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. ప్రస్తుతం బ్రెంట్‌ ధర బ్యారల్‌కు సుమారు 90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

అదానీ గ్రూప్ భారీ బిగ్‌ ప్లాన్.. ఒడిశాకు భారీ పెట్టుబడులు!

అదానీ గ్రూప్ భారీ బిగ్‌ ప్లాన్.. ఒడిశాకు భారీ పెట్టుబడులు!

డింక్‌ కపుల్‌ షాకింగ్‌ ప్లాన్‌.. 40ల్లోనే రిటైర్మెంట్‌!

డింక్‌ కపుల్‌ షాకింగ్‌ ప్లాన్‌.. 40ల్లోనే రిటైర్మెంట్‌!

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!

ట్యాగ్లు
ఓఎన్‌జీసీవెనెజువెలాచమురు ఉత్పత్తిభారతీయ కంపెనీలుముడిచమురుచమురు ధరలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు
సినిమాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
జనరల్

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..
జనరల్

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..
క్రీడలు

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్
గాసిప్స్

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?
రాజకీయాలు

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్
సినిమాలు

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..
జనరల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు
జనరల్

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత
జనరల్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!