

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. భారత్-అమెరికా డీల్‌పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడుల వలస కారణంగా రూపాయి విలువ (Rupee Value) పడిపోతోంది. క్రితం సెషన్లో డాలర్‌తో పోలిస్తే 90.78 వద్ద ముగిసిన రూపాయి.. మంగళవారం మరో 5 పైసలు పడి 90.83 వద్ద కొత్త కనిష్ఠ స్థాయిని చేరింది.
అనలిస్టులు చెబుతున్నట్టు, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమవ్వడం, మార్కెట్ ఒడుదొడుకులు, డాలర్ డిమాండ్ పెరగడం వంటి కారణాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ క్షీణత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, త్వరలో 91 మార్క్ కూడా తాకవచ్చని సూచిస్తున్నారు.
దీనితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్లకు పైగా పడిపోయినప్పుడు, నిఫ్టీ 25,900 వద్ద ఊగిసలాడుతోంది. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 359.13 పాయింట్ల నష్టంతో 84,854.23 వద్ద, నిఫ్టీ 105.55 పాయింట్ల నష్టంతో 25,921.75 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, మదుపర్ల అప్రమత్తత సూచీలు ఒత్తిడికి కారణమయ్యాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!