
జనరల్

మొబైల్ డేటా వినియోగించని వినియోగదారుల కోసం వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకే పరిమితమైన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్లాన్‌లు 7, 28, 56, 84 రోజుల వ్యాలిడీతో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీంతో ఇంటర్నెట్ అవసరం లేని వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో ప్లాన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ కొత్త ప్లాన్‌లతో రీఛార్జ్ ఖర్చు 50 నుంచి 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు, సీనియర్ సిటిజన్లు ఈ నిర్ణయంతో ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. వినియోగదారులకు అవసరానికి తగ్గ సేవలను ఎంచుకునే స్వేచ్ఛ కూడా మరింత పెరుగుతుందని టెలికాం రంగ నిపుణులు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!