

జూన్ నెలలో భారత్ ఎగుమతులు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. వార్షిక ప్రాతిపదికన 15.5 శాతం పెరిగి ఎగుమతుల విలువ 4,041 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3.88 లక్షల కోట్లు) చేరింది. అయితే అదే సమయంలో దిగుమతులు మరింత వేగంగా పెరగడంతో దేశ వాణిజ్య లోటు ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. జూన్‌లో వాణిజ్య లోటు 3,043 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.2.92 లక్షల కోట్లు) నమోదైంది.
ముడి చమురు ధరలు పెరగడం దిగుమతుల వ్యయాన్ని భారీగా ప్రభావితం చేసింది. జూన్‌లో ముడి చమురు దిగుమతులు 40 శాతం పెరిగి 1,932 కోట్ల డాలర్లకు చేరగా, మొత్తం దిగుమతులు 31 శాతం పెరిగి 7,084 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఎలక్ట్రానిక్స్ దిగుమతులు 58.77 శాతం, మెషినరీ దిగుమతులు 30.9 శాతం, బంగారం దిగుమతులు 7 శాతం పెరిగాయి. జూన్ తొలి పక్షంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 90 డాలర్ల వద్ద ఉండటంతో వాణిజ్య లోటు మరింత విస్తరించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!